‘మేము ఓట్లు వేయకున్నా పథకాలు అందుతున్నాయి’..
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:26 PM
కొండపి, మండలంలోని గోగినేనివారిపాలెంలో ఎస్సీ కాలనీలో బుధవారం మంత్రి స్వామి పర్యటిస్తున్నప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
అభివృద్ధి చేస్తా... ఈసారైనా ఓట్లు వేయండి
మహిళలు, మంత్రి స్వామి మధ్య మాటామంతీ
కొండపి, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గోగినేనివారిపాలెంలో ఎస్సీ కాలనీలో బుధవారం మంత్రి స్వామి పర్యటిస్తున్నప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చర్చి సెంటర్‌లో ప్రచారం చేస్తుండగా కొంతమంది మహిళలు మంత్రి స్వామికి కొద్దిదూరంలో నిల్చుని చూస్తున్నారు. మంత్రి వారిని దగ్గరకు పిలిచారు. ‘తాము ఓట్లేయలేదని.. అందుకే దూరంగా ఉన్నామని’ వారు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నిజాయితీగా విషయాన్ని చెప్పారు.. తప్పులేదు.. తనకు గత ఎన్నికల్లో ఓట్లు వేయకపోయినా మీ కాలనీలో నాలుగు నెలల్లో పూర్తిగా సైడు కాల్వలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి రాకపోతే చెప్పండి, ఇప్పిస్తానని వారితో మంత్రి చెప్పారు. అటువంటిదేమీ లేదని పథకాల డబ్బులు బాగా అందుతున్నాయని ఆ మహిళలు తెలిపారు. రాష్ట్రం కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా ఉండాలని అభ్యర్థించారు.