ఒక్కరు పోటీలో ఉన్నా ఎన్నికలే!
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:01 AM
ఎన్నికల కమిషన్ నూతన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి పోటీలో ఉన్నా ఇక నుంచి ఏకగ్రీవం లేదని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశమయ్యారు.
ఈసీ నూతన మార్గదర్శకాలు
వెల్లడించిన డీఆర్వో ఓబులేశు
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్ నూతన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి పోటీలో ఉన్నా ఇక నుంచి ఏకగ్రీవం లేదని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేశు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి నామినేషన్ వేసి పోటీలో ఉన్నా ఎన్నికలు జరుగుతాయ న్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి ఓటరుకు నచ్చకపోతే తన ఓటును నోటాకు వేసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. రెండు ఓట్లు ఉన్న ప్రజలు వెంటనే ఒక ఓటును రద్దు చేసు కోవాలన్నారు. ఓటుకు ఆధార్ అనుసం ధానానికి సహకరించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సమావేశంలో కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, కళావతి, సత్యనారాయణ, రవీంద్రారెడ్డి, పార్టీల ప్రతినిధులు వెంకట్రావు, డీఎస్ క్రాంతికుమార్, ఎస్‌కే రసూల్, గుర్రం సత్యం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.