మొదలైన కొత్త జిల్లా పనులు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:43 PM
మార్కాపురం జిల్లా ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు.
కార్యాలయాల ఏర్పాటులో
నిమగ్నమైన అధికారులు
ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కలెక్టరేట్
మార్కాపురం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లా ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ జయలక్ష్మి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం తర్లుపాడు రోడ్డులోని గోగులదిన్నెలో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామం సుంకేసుల పునరావాస కాలనీలో ఉన్న భవనాల్లో ఏర్పా టు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. సా యంత్రం నుంచి యుద్ధప్రాతిపదికన అ వసరమైన పనులను అధికారులు ప్రారంభించారు. ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి దగ్గరుండి స్థలాలను శుభ్రం చేయించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి విద్యుత్ సౌకర్యం ఏర్పాట్లు చేశారు. మిగిలిన శాఖల సిబ్బంది అధికారుల మౌఖిక ఆదేశాల మేరకు ముందస్తు పనుల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం మార్కాపురం వచ్చిన డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ తమ శాఖ జిల్లా కార్యాలయం కోసం తర్లుపాడు రోడ్డులోని పట్టు పరిశ్రమశాఖ భవనాన్ని పరిశీలించారు. దీనిపై సంబంధిత అధికారులు అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో పట్టణంలోని డ్వా క్రా బజార్‌ను ఆఫీ్‌సగా మార్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. వివి ధ శాఖల శాఖలకు సంబంధించి మార్కాపురంలో డివిజన్ కార్యాలయాలనే ప్రస్తుతానికి వినియోగించుకునేలా సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ పరిశీలించాలని సూచించినట్లు చెప్తున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు దృష్ట్యా అధికారిక వ్యవహారాలు వేగవంతమయ్యాయి.
నేడు జిల్లా అధికారులంతా
మార్కాపురంలో హాజరు కావాలి
కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ ఇవ్వటం, కలెక్టర్ భవనాన్ని ఎంపిక చేయడంతోపాటు అన్ని శాఖల జిల్లా అధికారులు బుధవారం మార్కాపురంలో హాజరు కావాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. తక్షణమే జిల్లా కార్యకలాపాలు ప్రారంభమవుతున్న నేపథ్యం లో అన్ని శాఖల అధికారులు మార్కాపురం నుంచి పనిచేసేందుకు నియమిం చిన వారిని తక్షణమే రిలీవ్ చేయాలని, వారంతా మార్కాపురం సబ్ కలెక్టర్ కా ర్యాలయం వద్దకు ఉదయం 10.30 గంటలకు చేరుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. బుధవారం కలెక్టర్ రాజాబాబుతోపాటు ఇతర జిల్లా అధికారులు మార్కాపురం విచ్చేసి వివిధ శాఖల భవనాలను పరిశీలించనున్నారు. మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.