Share News

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:05 PM

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం పట్టణంలోని పొట్టిశ్రీరాములు సెంటర్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
గిద్దలూరులో ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

స్వచ్ఛాంధ్రలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

రూ.15 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం

రూ.2 కోట్లతో వాకింగ్‌ ట్రాక్‌, పార్కుల అభివృద్ధి

గిద్దలూరు టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం పట్టణంలోని పొట్టిశ్రీరాములు సెంటర్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణంలో రూ.15కోట్లతో సీసీ రోడ్లను నిర్మించినట్లు చెప్పా రు. ప్రజల సౌకర్యార్థం రూ.2కోట్లతో వాకింగ్‌ ట్రాక్‌తో కూడిన పార్కు, చిల్డ్రన్‌ పార్కును అభివృద్ధి చేశామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, వైస్‌ చైర్మన్‌ గోడి ఓబులరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ ఇ.వి.రమణబాబు, తహసీల్దార్‌ ఎం.ఆంజనేయరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు షానేషావలి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, టీడీపీ నాయకులు దప్పిలి కాశిరెడ్డి, కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, బిల్లా రమేష్‌, రమేష్‌, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ ఎం.శివరామిరెడ్డి అన్నారు. స్వచ్ఛ అంధ్ర - స్వర్ణఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని దోర్నల బస్టాండ్‌, తర్లుపాడు రోడ్డులోని బాలికల వసతి నివాసంలో వ్యక్తిగత పరశుభ్రత, సామాజిక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలలకు బాలికలకు, అ వగాహన కల్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ పీవీఎస్‌ నారాయణరావు మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సాహకారం అం దించాలన్నారు. ఇళ్లతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై కాలువల లో చెత్త వేయరాదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కొండ య్య, పా ల్గొన్నారు.

పెద్దారవీడు : ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని దేవరాజుగట్టులో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలతో పరిశుభ్రతకు సంబంధించి ప్రతిజ్ఞన చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్ర భుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యక్తిగత ఆరో గ్యోం మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జాన్‌సుందరం, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసులు, టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి గొట్టం శ్రీనివాసులరెడ్డి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని ఎంపీడీవో ఏ బాలచెన్నయ్య తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై వీవోఏలు, స్వయం సహాయక సంఘ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వెలుగు ఎపీఎం డీ పిచ్చయ్య, సీసీలు, వీవోఏలు, ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో రాజ్‌కుమార్‌ కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం విఓఏలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి 250 కుటుంబాలకు ఒక క్లాప్‌మిత్ర ఉన్నారని వారంతా ప్రజలకు తడిపొడి చెత్తను వేరువేరుగా ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మురరళి, ఏపీఎం ఎడ్వర్డ్‌ పాల్గొన్నారు.

బేస్తవారపేట : గ్రామాల్లో ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పొందాలని డివిజనల్‌ అంచాయతీ అధికారి సుబ్బరావు అన్నారు.శ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంపీడీవో ఎ.వి.రంగనాయకులు, కార్యదర్శి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రాచర్ల : విద్యార్థులు ఆరోగ్య సూత్రాలను పాటించాలని వసతి గృహం సంక్షేమ అధికారి ఎస్‌ మురళి అన్నారు. అనుములవీడు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది సహకారంతో శనివారం ఆయన బీసీ వసతిగృహంలో విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో వై రంగనాయకులు ఏఎన్‌ఎం షమీం, ఆశ వర్కర్లు కుమారి, విజయ కుమారి పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం వల్ల మేధస్సు పెరుగుతుందని గ్రంథపాలకురాలు కే జాన్సీ అన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, పఠనం, గ్రంథాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఖాసింబాషా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

రాచర్ల : స్వచ్ఛ ఆంధ్ర సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని ఎంపీడీవో ఎస్‌ వెంకటరామిరె డ్డి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఐ వెంకటేష్‌, ఎంఈవో వి గిరిధర శర్మ, వెలుగు ఏపీఎం కె నరేష్‌, హెచ్‌ఎం బీఎల్‌ రామానాయక్‌, కార్యాలయ సిబ్బంది స్వామి రాజ్‌ కుమార్‌, కార్యదర్శి అనిల్‌ కుమార్‌, మహిళా సమాఖ్య సభ్యులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:05 PM