Share News

పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:50 PM

పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో జరిగిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు.

పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత
స్వచ్ఛాంధ్ర కార్యాక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో జరిగిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత త ప్పక పాటించాలన్నారు. కుటుంబం, సమాజ శ్రేయస్సు ను దృష్టిలో మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకో వాలన్నారు. ప్రతి నీటి బిందువును ఒడిసి పట్టుకుని వృథా కాకుండా చూడాలన్నారు. సమతులమైన వాతా వరణం మొక్కలతోనే సాధ్యమన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలునాటి సంరక్షించాలన్నారు. ఈసందర్భంగా ప్ర భుత్వ హైస్కూల్‌ ఎమ్మెల్యే మొక్కలు నాటారు.

కార్యక్ర మంలో ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, ఎంఈవో యూవీ నారాయణరెడ్డి, దేవిరెడ్డి రామిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, నాయకులు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, కొండా కృష్ణారెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, తమ్మినేని వెంకటరెడ్డి, ఐవీ నారాయణ, నజిముద్దీన్‌, బాలు ఓబులురెడ్డి, జంషీర్‌ అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాక్షేమమే పరమావధి - ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి ప్రాంతంలోని ప్రజానీకం ఆరోగ్యంగా ఉండాలనేది తమ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జనని కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణా సంస్థ సంయుక్త సహకారంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వృద్ధులకు ఎలా ఉందంటూ పలకరించారు. వృద్ధులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కంటి శస్త్రచికిత్స కోసం గుంటూరు శంకర కంటి ఆసుపత్రికి వెళ్ళినపుడు అక్కడ వైద్యుల సేవలు ఎలా ఉన్నాయని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరానికి 168 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారికి శంకర కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ సుప్రియ కంటి పరీక్షలు చేశారు. వారిలో 32 మంది కంటి శస్త్ర చికిత్సలు అవసరంగా నిర్ధారించారు. కంటి ఆపరేషన్‌ చేయించుకున్న వారికి శిబిరంలో కంటి అద్దాలు, చుక్కలు మందులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 10:50 PM