పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:48 AM
పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసు కోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు.

మార్కాపురం రూరల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసు కోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. పట్టణంలోని గడియార స్తంభం వద్ద శనివారం నిర్వ హించిన స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సబ్‌కలెక్టర్ త్రివినాగ్, అధికారులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియో గం వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నారు. మనుషులతో పాటు పశువులు కూడా ప్లాస్లిక్ వలన అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. ప్రతిఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ తోటి వారికి స్ఫూర్తిగా ఉండాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సేకరణ వాహనాలలో మాత్రమే వేయాలని కోరారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధులలో అధికారులు, నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పూలకొట్ల వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని నోటీసులను అందజేశారు. సబ్‌కలెక్టర్ త్రివినాగ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న స్వచ్చ ఆంధ్ర స్వర్ణఆంధ్ర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాము లు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్, టీడీపీ నాయకులు మౌలాలి, వక్కలగడ్డ మల్లికార్జున, కొప్పుల శ్రీను, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పొదిలి : స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్చ మున్సిపాలిటీ కారక్రమంలో భాగంగా శనివారం మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరరావు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ విని యోగంతో వచ్చే అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వ హించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దదోర్నాల : ప్రతిఒక్కరూ వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని వై.పాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. దోర్నాలలో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరిక్షన్‌బాబు హాజరయ్యారు. చీపురు పట్టి వీధులు శుభ్రంచేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతేగాక ప్లాస్టిక్ నిషేఽధాన్ని అందరూ పాటించాలని చేతిసంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్మికు లను అభినందిస్తూ వారిని సన్మానించారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో నాసర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావు, టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, షేక్ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, చల్లా వెంకటేశ్వర్లు, షేక్ మంజూర్ భాష, కే.సుబ్బారెడి, జనసేన నాయకులు కే.మురళి తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : ప్లాస్టిక్ రహిత గిద్దలూరు పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు, కూట మి నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్దబజారు, పొట్టి శ్రీరా ములు విగ్రహం వరకు నిర్వ హించారు. అక్కడ అందరూ మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టీక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ పాల్గొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, కమిషనర్ ఐ.శ్రీనివాసులు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్‌సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం రూరల్ : ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామని ఎంపీడీవో బండారు శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కాశికుంట తండాలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ , ఎంసీహెచ్ మంత్రునాయక్ అధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలకు ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ప్రజలతో పాటు సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలకు చేతి సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్‌నాయక్, పంచాయతీ రాజ్ డీఈ ఏఈ, పాఠశాల చైర్మన్, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
త్రిపురాంతకం : స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్రపై శనివారం అధికారులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఎంపీడీవో రాజ్‌కుమార్ ఆద్వర్యంలో త్రిపురాంతకం గ్రామ సచివాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్నెస్పీ డీఈఈ విజయలక్ష్మీ ఆద్వర్యంలో ముడివేముల మేజర్ పరిసరాలలో స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి కంపచెట్లను తొలగించారు. అనంతరం అధికారులు, సిబ్బంది, నీటి సంఘం అధ్యక్షుల ఆద్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాలలో డీసీ అధ్యక్షుడు దేవినేని చలమయ్య, ఈవోపీఆర్‌డీ రామసుబ్బయ్య, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.