పేదల ఆరోగ్యానికి భరోసా
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:09 PM
అనారోగ్య పరిస్థితులలో ఆర్థికంగా సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా ఇస్తుందని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య పరిస్థితులలో ఆర్థికంగా సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా ఇస్తుందని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10వ విడతలో 74 మందికి రూ.32.26 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోమవారం ఉదయం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 645 మందికి 6 కోట్ల రూపాయల మేర చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
2