Share News

రబీకి సరిపడా యూరియా

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:41 AM

జిల్లాలో రబీ (2025-26) సీజన్‌లో అన్ని పంటలకు అవసరమైన యూరియా అందుబా టులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఆ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రబీ సీజన్‌కు 34,878 మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

రబీకి సరిపడా యూరియా

అందుబాటులో 6,773 మెట్రిక్‌ టన్నులు

జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రబీ (2025-26) సీజన్‌లో అన్ని పంటలకు అవసరమైన యూరియా అందుబా టులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఆ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రబీ సీజన్‌కు 34,878 మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో ఈ నెలాఖరుకు 23,115 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 26,459 మెట్రిక్‌ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో 800 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. అక్టోబరు 1 నుంచి డిసెంబరు 17వతేదీ వరకు 22,481 మెట్రిక్‌ టన్నుల యూరియా విక్రయాలు జరగ్గా బుధవారం నుంచి మరో 13 రోజులకు 4,212 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 6,773 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నదన్నారు. యూరియాను కోఆపరేటివ్‌ సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్‌, రిటైల్‌/హోల్‌సేల్‌, కంపెనీ గోదాములలో ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రానున్న పంట కాలంలో కూడా కొరత ఉండదని స్పష్టం చేశారు. నానో యూరియా, నానో డీఎపీ ఎరువులను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. అందువల్ల రైతులు ఎరువులను బస్తాపై ముద్రించిన ఎంఆర్‌పీని చూసుకొని కొనుగోలు చేయాలని సూచించారు. ఎక్కడైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను దారిమళ్లించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు

Updated Date - Dec 18 , 2025 | 02:41 AM