Share News

నగర అభివృద్ధిలో ఇంజనీర్లు భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Sep 15 , 2025 | 10:52 PM

ఒంగోలు నగర అభివృద్ధిలో ఇంజనీర్లు భాగస్వాములు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆర్కిటెక్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ దినోత్సవాన్ని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు.

నగర అభివృద్ధిలో ఇంజనీర్లు భాగస్వాములు కావాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దామచర్ల

ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సభలో ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర అభివృద్ధిలో ఇంజనీర్లు భాగస్వాములు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆర్కిటెక్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ దినోత్సవాన్ని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ఎ్‌స.రాజు, మధు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నగరంలో అధునాతన భవనాలు, మెగా షాపింగ్‌ మాల్స్‌, పలు నిర్మాణాలలో ఇంజనీర్లు భాగస్వాములు కావాలని కోరారు. విశ్వేశ్వరయ్య నిర్మాణ రంగంలో తనదైన శైలిలో చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలను నిర్మించారన్నారు. అలాంటి మహనీయులును స్మరించుకోవడం అభినందనీయం అని తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత మాట్లాడారు. అంతకుముందు కార్పొరేషన్‌ కార్యాలయంలో విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద నగర కమిషనర్‌ కే. వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యేనివాళులు అర్పించారు.

Updated Date - Sep 15 , 2025 | 10:52 PM