ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:23 AM
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలు నగరం హౌసింగ్‌బోర్డ్ కాలనీలో శుక్రవారం జరిగింది.
ఒంగోలు క్రైం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలు నగరం హౌసింగ్‌బోర్డ్ కాలనీలో శుక్రవారం జరిగింది. స్థానిక నగర శివారు ప్రాంతంలో ఉండే ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకునే నలుగురు విద్యార్థులు హౌసింగ్ బోర్డు కాలనీలో రేకుల ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇంటిలో ఎవరూ లేని సమయం లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాపట్ల దిగ్విజయ్‌సాయిమణికంఠ (22) ఇనుప కమ్మీకి టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయగా వారు ఒంగోలు వచ్చి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. విద్యార్థి మృతికి గల కారణం తెలియాల్సి ఉంది.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ఒంగోలు క్రైం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వ్యక్తి పెళ్ళూరు-వాసేపల్లిపాడు మధ్య పొలాల్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు శుక్రవారం ఒంగోలు తాలుకా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 55ఏళ్ళు ఉంటుందని, లేతబూడిద రంగు ప్యాంట్, బ్లూ కలర్ కట్‌బనీయన్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసినవారు 9121104780, 9121102127 సెల్ నంబర్లను సంప్రందిచాలని తాలుకా సీఐ విజయకృష్ణ కోరారు.