20వ తేదీలోపు ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 10:39 PM
మినీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో కాలువ కట్టపై తాత్కాలిక నివాసం ఉండే కుటుంబాలు ఈ నెల 20వ తేదీలోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర చెప్పారు.
అద్దంకి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మినీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో కాలువ కట్టపై తాత్కాలిక నివాసం ఉండే కుటుంబాలు ఈ నెల 20వ తేదీలోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర చెప్పారు. సోమవారం ఉదయం కాలువ కట్టపై తాత్కాలిక నివాసం ఉంటున్న కుటుంబాలతో కమిషనర్ మాట్లాడారు. అద్దంకి కొండ వద్ద ఇళ్ల స్థలాల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన పూర్తయిన నేపథ్యంలో స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ఆదేశించారు. మరికొంత సమయం కావాలని స్థానికులు కోరటంతో ఇప్పటికే పనులు ఆలస్యం అయినందున పొడిగింపు సాధ్యం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో 20వ తేదీ నాటికి స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారా లేక బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందో వేచి చూడాల్సి ఉంది.