Share News

పరిశ్రమలతోనే ఉపాధి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:33 PM

పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. తద్వార గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు.

పరిశ్రమలతోనే ఉపాధి
నేరేడుపల్లిలో రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

గుంటుపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో పర్యటన

పీసీపల్లి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. తద్వార గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు. మంగళవారం మం డలంలోని గుంటుపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. దివాకరపురం సమీపంలో నిర్మిస్తున్న రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌కు అవసరమైన గడ్డిని పెంచేందుకు భూముల కోసం ఆయా గ్రామాల రైతులతో రెవెన్యూ అధికారులతో కలిసి చర్చించారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ గ్రామాభి వృద్ధి, స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశా లకు ఈపరిశ్రమ ఎంతో ఉపయోగకరమన్నారు. రైతు లు తమ సమస్యలు, అభ్యంతరాలను వివరించగా స్పం దించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ భవిష్యత్తును దృష్టి లో ఉంచుకుని మీ అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుం టామన్నారు. బలవంత భూసేకరణ ఉండదన్నారు. కౌలుకు భూములివ్వదల చిన రైతులు తమ అంగీకా ర పత్రాలను తహసీల్దా ర్‌కు ఇవ్వాలన్నారు.

కార్యక్రమంలో తహసీ ల్దార్‌ సీహెచ్‌ ఉష. నాయ కులు గడ్డం బాలసుబ్బ య్య, వేమూరి రామయ్య, పులి ప్రతాప్‌రెడ్డి, నేరేడుపల్లి సర్పంచ్‌ పల్లా మల్లికా ర్జున్‌, మండే వెంకటకొండారెడ్డి, సానికొమ్ము విజయ భాస్కర్‌రెడ్డి, రాగిపాటి హజరత్‌, మూలె బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:33 PM