నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ప్రణాళికలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:30 AM
విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు.
కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు(రూరల్), డిసెంబరు19(ఆంధ్రజ్యో తి): విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రతినిధుల తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సెంచూరియన్ విశ్వవిద్యాలయం వారితో శిక్షణ ఇచ్చేలా చ ర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హార్టీకల్చర్, ఆక్వాకల్చర్, మైనింగ్, పోర్ట్‌లు, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసిసింగ్, హైడ్రోకార్బన్ తదితర రంగాల్లో శిక్షణ ఉంటుందని, అనంతరం అభ్యర్థులను ఉద్యోగాల కోసం ఆయా కంపెనీలకు అనుసం ధానం చేస్తామన్నారు. అందుకోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, స్కిల్ డవ్‌లప్‌మెంట్ సెంటర్‌ల ను ఏర్పాటు చేయటానికి త్వరతగతిన ప్రణాళి కలు తయారు చేయాలని ఆయా శాఖల అ ధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమం లో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రతినిధి జేఎ న్.రావు, గనులశాఖ డీడీ రాజశేఖర్, జిల్లా స్కి ల్‌డవ్‌లప్‌మెంట్ అధికారి రవితేజ, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ, జడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లా ఉపాధికల్పనాధికారి రమాదేవి, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం శ్రీని వాసరావు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ తది తరులు పాల్గొన్నారు.