Share News

జాబ్‌ మేళాతో యువతకు ఉపాధి

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:33 PM

నిరుద్యోగ యువతీయువకులకు జాబ్‌ మేళాతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించారు.

జాబ్‌ మేళాతో యువతకు ఉపాధి
జాబ్‌ మేళానుద్దేశించి మాట్లాడుతున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగ యువతీయువకులకు జాబ్‌ మేళాతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థ ద్వారా జాబ్‌ మేళాలను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ మేళాలో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలని 10 కంపెనీల ప్రతినిధులను ఆయన కోరారు. 157 మంది నిరుద్యోగులు పాల్గొనగా, 74 మంది ఉద్యోగాలకు ఎంపిక అయినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, టీడీపీ మండలాధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీధరనాయుడు, ఏపీఎస్‌ ఎస్‌డీసీ విజయకుమారి, నందన్‌బాబు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 10:33 PM