20న రాజ్యాంగంపై వక్తృత్వ పోటీలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:35 AM
భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహాన కలిగి ఉండాలని జిల్లా అబివృద్ధి వేదిక అధ్యక్షుడు చుం డూరి రంగారావు అన్నారు.
ఒంగోలు కలెక్టరేట్, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహాన కలిగి ఉండాలని జిల్లా అబివృద్ధి వేదిక అధ్యక్షుడు చుం డూరి రంగారావు అన్నారు. స్థానిక ఎంసీఏభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈనెల 20నుంచి 26వతేదీ వరకు ఒంగోలులోని ఎంసీఏ భవన్‌లో భారత రాజ్యాంగం కనీస అవగాహన అంశంపై వక్తృత్వ పో టీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువతకు వేర్వేరు విభాగాల్లో పోటీలు జరుతాయన్నారు. జూనియర్ విభాగంలో మొదటి బహుమతి రూ.6వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు, తృతీయ బహుమతి రూ.4వేలు, యువత విభాగంలో ప్రథమ బహుమతి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.8వేలు, తృతీయ బహుమతి రూ.7వేలతో పాటు మరో పది మందికి కాన్సొలే షన్ బహుమతులు, సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. అనంతరం వారు కరప త్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఓపీ డీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, రిటైర్డ్ హెచ్‌ఎం డి.వెంకటేశ్వర్లు, పీ డీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, గడ్డం మురహరిరావు, హరిప్ర సాద్, లెక్చరర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.