మహాకుంభాభిషేకం కలశయాత్రలో పాల్గొననున్న ఏనుగు
ABN , Publish Date - May 11 , 2025 | 11:13 PM
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం సంద ర్భంగా కలశయాత్రలో పాల్గొనేందుకు ఏనుగు వస్తున్న నేపథ్యంలో శింగరకొండలో ఏర్పాట్లను ఆదివారం అటవీశాఖ అధికారులు, ఈవో తిమ్మానాయుడు పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలించిన అటవీశాఖ అధికారులు
19న గుండ్లకమ్మ నది నుంచి శింగరకొండ వరకు వెయ్యి మంది మహిళలతో కలశ పాదయాత్ర
మహాకుంభాభిషేకం కలశయాత్రలో పాల్గొననున్న ఏనుగు
అద్దంకి, మే 11 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం సంద ర్భంగా కలశయాత్రలో పాల్గొనేందుకు ఏనుగు వస్తున్న నేపథ్యంలో శింగరకొండలో ఏర్పాట్లను ఆదివారం అటవీశాఖ అధికారులు, ఈవో తిమ్మానాయుడు పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ నుంచి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురానున్నారు. 19వ తేదీ ఉదయం 5 గంటలకు అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి వెయ్యి మందికి పైగా మహిళలతో కలశ పాదయాత్ర ప్రారంభమై పట్టణంలో గుండా శింగరకొండ వరకు సాగనుంది. కలశపాద యాత్ర ముందు భాగంలో ఏనుగు నడవనుంది. అదే సమయంలో అభిషేకంలో ఏనుగు పాల్గొననుంది. ఈ నేపథ్యంలో 16వ తేదీకి ఏనుగు శింగరకొండ చేరుకొని 20వ తేదీ తిరిగి వెళ్లనుంది. ఈ నేపధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను ఆదివారం చీరాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణారావు, వేటపాలెం సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, కూకట్లపల్లి బీట్ ఆఫీసర్ రమేష్, ఈవో పరిశీలించారు.