Share News

గూడేలలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 16 , 2025 | 10:41 PM

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి, నల్లమల అటవీ ప్రాంతంలో జీవించే చెంచుల గూడేలలో సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేసి వెలుగులు నింపాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కోరారు. ఈ మేరకు ఆయన విద్యుత్‌ శాఖ సీఎండీ పీ పుల్లారెడ్డిని సోమవారం విజయవాడలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

గూడేలలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి

సీఎండీ పుల్లారెడ్డిని కోరిన ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి, నల్లమల అటవీ ప్రాంతంలో జీవించే చెంచుల గూడేలలో సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేసి వెలుగులు నింపాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కోరారు. ఈ మేరకు ఆయన విద్యుత్‌ శాఖ సీఎండీ పీ పుల్లారెడ్డిని సోమవారం విజయవాడలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. వైపాలెం నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య ఎక్కువుగా ఉందని అందుకు అవసరమైన సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయాలని, ఎక్కువ శాతం నల్లమల అటవీ ప్రాంతాలలో చెంచులుండే గూడేలలో విద్యుత్‌ లైన్‌ల ఏర్పాటుకు అటవీశాఖ అధికారుల అనుమతులు ఉండవని ఎరిక్షన్‌బాబు వివరించారు. అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి గూడెం వాసుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. వ్యవసాయానికి కూడా సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలన్నింటిపైనా సీఎండీ సానుకూలంగా స్పందించారని ఎరిక్షన్‌బాబు తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 10:41 PM