Share News

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 10:42 PM

నియోజకవర్గం లో విద్యుత్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థ్ధానిక అమరావతి గ్రౌండ్‌లో నియోజకవర్గస్థాయి విద్యుత్‌ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.95 కోట్లతో ఆర్డీఎస్‌ పథకం కింద పనులు చేపట్టినట్టు చెప్పారు.

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశం

కనిగిరి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం లో విద్యుత్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థ్ధానిక అమరావతి గ్రౌండ్‌లో నియోజకవర్గస్థాయి విద్యుత్‌ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.95 కోట్లతో ఆర్డీఎస్‌ పథకం కింద పనులు చేపట్టినట్టు చెప్పారు. ఈపథకం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పనులను త్వరితిగతిన మరింత నాణ్యతతో నిర్వహించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేవిధంగా ఉన్న విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, మరమ్మతులు అవసరమైన ప్రాం తాలు ఉంటే వాటిని గుర్తించి మార్పులు చేపట్టాల న్నారు. గ్రామీణ ప్రాంతాలు, కాలనీల్లో మరమ్మతులకు గురైన స్తంభాలు, కేబుల్‌ వైర్ల మార్పిడికి అధిక ప్రాఽ దాన్యత ఇచ్చి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

రోడ్ల మధ్య అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, విరిగి న స్తంభాలు, విద్యుత్‌ లైన్లతో ప్రమాద అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర ఆదేశించారు. విద్యుత్‌ సిబ్బంది కొరత ఉ న్న ప్రాంతాల్లో కొత్తవారిని నియమించుకోవాలని ఆదే శించారు. ప్రజలకు ఏమైన సమస్యలు వస్తే తమ పరిదిలోనివి వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కరిం చలేనివాటిని ఉన్నతాధికారులకు నివేదించి పత్యామ్నా య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇతర శాఖలతో సమన్వయంతో పనిచే యాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వ ర్లు, ఈఈలు ఉమాకాంత్‌, నాగేశ్వరరావు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 10:42 PM