Share News

వృద్ధుడు అనుమానాస్పద మృతి

ABN , Publish Date - May 03 , 2025 | 12:22 AM

అనుమా నాస్పద రీతిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం కొప్పోలు ఫ్లైఓవర్‌ బిడ్జి కింద శుక్రవారం ఉదయం వె లుగు చూసింది.

వృద్ధుడు అనుమానాస్పద మృతి

ఒంగోలు క్రైం, మే2(ఆంధ్రజ్యోతి): అనుమా నాస్పద రీతిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం కొప్పోలు ఫ్లైఓవర్‌ బిడ్జి కింద శుక్రవారం ఉదయం వె లుగు చూసింది. నగరంలోని దేవుడుచెరువు లో నివాసం ఉండే ఎస్‌కే..మహబూబ్‌బాషా (63) పాతరేకులు వ్యాపారం చేసుకుంటూ జీ విస్తున్నాడు. ఈక్రమంలో ఎఫ్‌సీఐ ఎదురుగా ఉన్న ఇందిరకాలనీలో నివాసం ఉండే మహ బూబ్‌ బాషా కుమార్తె ఇంట్లో భోజనం చేసి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద సిమెంట్‌ బల్లల పైన రా త్రులు పడుకుంటాడు. అతనికి మద్యం సేవిం చే అలవాటు ఉంది. అంతేగాకుండా గురువా రం పింఛను రావడంతో అతని స్నేహితులు న లుగురుతో కలిసి రాత్రి 11 గంటల వరకు మ ద్యం తాగినట్లు చెబుతున్నారు. తెల్లవారేసరికి సిమెంట్‌ బల్ల మీద కాకుండా కింద పడి మృతి చెందాడు. ఽఛాతి మీద గాయమై రక్తం కారింది. సమాచారం అందుకున్న తాలుకా పోలీస్‌స్టేషన్‌ సీఐ అజయ్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరి శీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమో దు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం ని ర్వహించి బంధువులకు అప్పగించారు. మృతు డి ఛాతిపై గాయం ఎలా అయిందనే పోలీసు లు విచారిస్తున్నారు. అతనితో కలిసి మద్యం తాగిన వారిని విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయా పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా ల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Updated Date - May 03 , 2025 | 12:22 AM