Share News

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

ABN , Publish Date - Sep 01 , 2025 | 10:55 PM

గ్రా మాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం మండలం లోని రమణారెడ్డిపాలెంలో రూ.26 లక్షల ఉపాధి నిధులతో చేపట్టిన మ్యాజిక్‌ డ్రెన్‌ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
రమణారెడ్డిపాలెంలో మ్యాజిక్‌ డ్రైన్‌కు భూమి పూజ చేస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

ముండ్లమూరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రా మాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం మండలం లోని రమణారెడ్డిపాలెంలో రూ.26 లక్షల ఉపాధి నిధులతో చేపట్టిన మ్యాజిక్‌ డ్రెన్‌ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ భూగర్భ డ్రైనేజీలతో ప్రజలు ఆరోగ్యప రంగా ఉండటమే కాకుండా ఎటువంటి వ్యాధులు దరిచేరవన్నారు. వేములబండ- ఈదర రహ దారికి త్వరలోనే నిధులు మంజూరవుతాయని చెప్పా రు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు దర్శి పర్యటనకు వచ్చినప్పుడు రహదారి గురించి వివరించి నట్టు చెప్పారు. అనంతరం గ్రామస్థుల నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రా మంలో ఇంటింటికి వెళ్లి డాక్టర్‌ లక్ష్మి పింఛన్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజ కవర్గ నాయకుడు కడియాల లలిత్‌సాగర్‌, ఎంపీడీవో అబ్దుల్‌ రహీం, ఏపీవో వెంకటరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, డీసీ చైర్మన్‌ కంచుమాటి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలం లోని వేములబండ గ్రామస్థులతో కొద్దిసేపు మా ట్లాడారు.

Updated Date - Sep 01 , 2025 | 10:55 PM