మౌలిక వసతుల కల్పనకు కృషి
ABN , Publish Date - Dec 14 , 2025 | 10:28 PM
వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. చాయ్ కార్యక్రమంలో భాగంగ ఆదివారం 9వ వార్డులోని ముగ్గు బావివీధి, బోయపాలెం, పాతూరు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయా ప్రాంత వాసులు తమ సమస్యలను విన్నవించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. చాయ్ కార్యక్రమంలో భాగంగ ఆదివారం 9వ వార్డులోని ముగ్గు బావివీధి, బోయపాలెం, పాతూరు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయా ప్రాంత వాసులు తమ సమస్యలను విన్నవించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ అతిత్వరలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిల ద్వారా సాగర్‌నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుప రుస్తామన్నారు. ప్రజలకు మరింత సేవలు అందించి కనిగిరి అభి వృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. స్థానిక సమస్యలను కేఎ్‌సఎస్ సభ్యులు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూ చించారు. కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర నాయకుడు జంషీర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్, తిరుపతయ్య, నజిముద్దీన్, బడేభాయి, కొబ్బరిబొండాల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.