ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్య నియంత్రణకు కృషి
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:46 PM
ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యల నియంత్రణకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు.
రూ.11.16 కోట్లు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఆనందోత్సాహాల్లో పొదుపు సంఘాల మహిళలు, చిరువ్యాపారులు
చీరాల, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి) : ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యల నియంత్రణకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. బుధవారం స్థానిక బాపనమ్మ కల్యాణ మండపంలో మెప్మా మేనేజర్ కొండయ్య ఆధ్వర్యంలో సీఎం స్వానిధి 2.0 కార్యక్రమంలో భాగంగా కల్యాణ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా 53 పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా రూ.10.02 కోట్లు, అలాగే పీఎం స్వానిధి ద్వారా 503 మంది వీధి విక్రయిదారులు, చిరువ్యాపారులకు రూ.1.02 కోట్లు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరువ్యాపారులను సైతం ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. బ్యాంకుల ద్వారా అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. అంతకుమందు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దేశాయిపేట, రామకృష్ణాపురం, మున్సిపల్ పరిధిలోని 16 వార్డులో నిర్వహించారు. అలాగే వస్త్రవ్యాపారులతో జీఎస్టీ సంస్కరణల ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డు కమిటీ ఆధ్వర్యంలో రైతులకు జీఎస్టీ తగ్గింపులతో కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.