కోటయ్య ఆశయాల సాధనకు కృషి
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:01 PM
వేగినాటి కోటయ్య సేవలు ఎనలేనివని, ఆయన ఆసయ సాధనకు కృషి చేస్తామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. కోటయ్య వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : వేగినాటి కోటయ్య సేవలు ఎనలేనివని, ఆయన ఆసయ సాధనకు కృషి చేస్తామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. కోటయ్య వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రధాన సెంటరులో వేగినాటి కోటయ్య కాంస్య విగ్రహానికి ఎరిక్షన్‌బాబు, కోటయ్య తనయుడు వేగినాటి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగినసభలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఎర్రగొండపాలెంలో ప్రజలకు అవసరమైన పాలశీతలీకరణ కేంద్రం, జూనియర్ కాలేజీ, చెంచు విద్యార్థులకు గురుకుల పాఠశాల, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలలో 15 పైగా జడ్పీ ఉన్నతపాఠశాలలను మంజూరు చేయించి విద్యాభివృద్ధికి కోటయ్య కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ త్రిపురాంతకం మండల పార్టీ అధ్యక్షుడు ఎం.వళరాజు, టీడీపీ ముఖ్యనాయకులు చిట్యాల వెంగళరెడ్డి, తోట మహేష్, కాకర్ల కోటయ్య, బీవీ సుబ్బారెడ్డి, అచ్యుతరావు, మంత్రునాయక్, సత్యనారాయణగౌడ్, నాగేశ్వరరావు, నాసరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మస్తాన్‌వలి, చేదూరి లక్ష్ముయ్య, పోకా వెంకట సుబ్బయ్య, సుబ్రమణ్యం, గోళ్లరావు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు.