పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:20 PM
ఇటీవల ఒంగోలు పార్లమెంట్ నూతన కమిటీలో నియమితులైన నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ కమిటీ సభ్యులకు
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సూచన
గిద్దలూరు టౌన్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఒంగోలు పార్లమెంట్ నూతన కమిటీలో నియమితులైన నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ కా ర్యాలయంలో కమిటీలో ఉపాధ్యక్షులుగా నియమితులైన కంభంకు చెందిన బిజ్జాల కిశోర్, కోశాధికారిగా నియమితులైన రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన అంబవరం శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా పట్టణానికి చెందిన గుర్రం దానియేలు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి పూలమాలలతో, శాలువలతో సన్మానించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో కంభం మార్కెట్‌యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్‌రెడ్డి, కంభం, రాచ ర్ల మండలపార్టీల అధ్యక్షులు శ్రీనివాసులు, యోగానంద్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు, భాస్కర్ పాల్గొన్నారు.