టీడీపీ పటిష్టతకు కృషి చేయాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:02 PM
టీడీపీ పటిష్టతకు కృషిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం పార్టీ అనుబంధ కమిటీల నియోజకవర్గ అధ్యక్షులను ఆయన సన్మానించారు. ఈసందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ పార్టీ బలోపేతం కృషి చేసిన వారికి తగిన గౌరవం లభిస్తుందన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ పటిష్టతకు కృషిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం పార్టీ అనుబంధ కమిటీల నియోజకవర్గ అధ్యక్షులను ఆయన సన్మానించారు. ఈసందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ పార్టీ బలోపేతం కృషి చేసిన వారికి తగిన గౌరవం లభిస్తుందన్నారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, లీగల్‌సెల్, కల్చరల్, రైతు, విద్యార్థి సంఘాలు, వాణిజ్య, వ్యాపార, విభిన్న ప్రతిభావంతులు, తెలుగు మహిళ, తెలుగుయువత అధ్యక్షుల పదవులను కల్పించి సముచిత స్థానం ఇవ్వటం జరిగిందన్నారు. జంషీర్ అహ్మద్ ఐటీడీపీ రాష్ట్ర నాయకులుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను సోషల్‌మీడియాలో చురుకుగా ప్రచారం చేయటంతో పాటు, పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీకి మంచి పేరుకు తీసుకురావటం అభినందనీయమన్నారు. తెలుగుమహిళా అధ్యక్షురాలిగా నియమితులైన స్వప్న పార్టీ కార్యక్రమాల్లో చురకుగా పాల్గొనటమే కాకుండా పార్టీకి మరింత బలం పెరిగేలా వివిధ సేవలను ప్రజలకు అందించారన్నారు. ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా రెండోసారి కూడా బలసాని కోటయ్య నియామకం ఆయన పార్టీకి చేసిన సేవలకు నిదర్శనమన్నారు. దొడ్డా వెంకటసురేష్‌రెడ్డిని నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడిగా, టీఎన్‌ఎఫ్ అధ్యక్షుడిగా షేక్ అప్రోజ్‌ను నియామకం చేయటం పట్ల యువతకు ప్రాధాన్యత టీడీపీలోనే సాధ్యమని మరోసారి రుజువు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్టీఆర్), మండలపార్టీ కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, తాతాపూడి స్టాలిన్ (బుజ్జన్న), పట్టణ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
(3కెఎన్‌జి11) 15 ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్ రాజారెడ్డి
టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్
కనిగిరి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మాచవరంకు చెందిన 6వ వార్డు కౌన్సిలర్ పోతిరెడ్డి రాజారెడ్డి వైసీపీని వీడి 15 కుటుంబాలతో సోమవారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయనకు డాక్టర్ ఉగ్ర పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అదేసమయంలో పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని గ్రామంలో విజయవంతంగా నిర్వహించి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, బుల్లా బాలబాబు, సిద్దాంతి బారాయిమాం తదితరులు పాల్గొన్నారు.