Share News

టీడీపీ బలోపేతానికి కృషిచేయాలి

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:54 PM

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మండలంలోని కంభాలదిన్నె లో పార్టీ గ్రామ అధ్యక్షుడు మన్నం రమణయ్య ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషిచేయాలి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

పామూరు, సెస్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మండలంలోని కంభాలదిన్నె లో పార్టీ గ్రామ అధ్యక్షుడు మన్నం రమణయ్య ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌, పరిటాల రవీంద్ర, విగ్రహాలను ఆవిష్కరించారు. అ నంతరం జరిగిన ఆత్మీయ సభలో డాక్టర్‌ ఉగ్ర మా ట్లాడారు. ఏఎంసీ, సింగిల్‌విండో పదవులు పొందిన యారవ శ్రీను, ఉప్పలపాటి హరిబాబు తమ సొసై టీల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించి మన్నన లు పొందాలన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడిగా బాధ్యత లు చేపట్టిన బొల్లా నరసింహారావును అభినందిస్తూ పార్టీ లోని అన్నివర్గాల వారిని కలుపుకొని మండలంలో టీడీపీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. అనంతరం యారవ శ్రీను, బొల్లా నరసింహారావు, ఉప్పలపాటి హరిబాబు, టీడీ పీ మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లును శా లువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కూట మి నాయకులు కోటపాటి జనార్దనరావు, గోళ్ల భాస్కరరావు, చుంచు కొండయ్య, గద్దె గంగయ్యచౌదరి, పువ్వాడి వెంకటే శ్వర్లు, కేవీ రమణయ్య, దరిశి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం

సీఎస్‌పురం(పామూరు), సెస్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మండల సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై ఎమ్మెల్యే ఉగ్రనరసిం హారెడ్డి మండిపడ్డారు. ఎంపీపీ వ్యవహరి స్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ స మావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయా రు. ఆదివారం జరిగిన సమావేశంలో ఎం పీడీవో వి.ప్రతాప్‌రెడ్డి ముందుగా ఎమ్మెల్యే ఉగ్రను కాకుండా ఎంపీపీ మూడమంచు వెంకటేశ్వర్లును పిలిచారు. ఆతరువాత ఎ మ్మెల్యేను వేదిక పైకి పిలిచారు. వేదిక పైకి జిల్లా ఛీప్‌ సొసైటీ చైర్మన్‌ టీ.గోపిని ఆహ్వా నించమని ఎమ్మెల్యే సూచించారు. వైస్‌ ఎంపీపీని కూడా పిలువాలి అని ఎం పీపీ తెలపగా, జిల్లాస్థాయి పదవులు ఉన్న వారిని పిలవ కపోతే మేమెందుకు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చ అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన జె.భారతి, జి.వెంకటేశ్వర్లును సన్మానించారు. స మావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 10:54 PM