Share News

రైతుల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Aug 11 , 2025 | 10:13 PM

రైతుల అభివృద్ధికి సొసైటీల చైర్మన్‌లు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎంపికైన కనిగిరి, లింగారెడ్డిపల్లి సొసైటీల చైర్మన్‌లను ఎమ్మెల్యే అభినందించారు.

 రైతుల అభివృద్ధికి కృషి చేయాలి
ఎమ్మెల్యేను సన్మానించిన నూతన పీఏసీఎస్‌ చైర్మన్‌ రంగబాబు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి) : రైతుల అభివృద్ధికి సొసైటీల చైర్మన్‌లు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎంపికైన కనిగిరి, లింగారెడ్డిపల్లి సొసైటీల చైర్మన్‌లను ఎమ్మెల్యే అభినందించారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పంటల సాగుకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇప్పించి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలన్నారు. కనిగిరి పీఏసీఎస్‌గా అద్దంకి రంగబాబు, లింగారెడ్డిపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా కమతం చినవెంకటేశ్వర్లు నియామకం అయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఎంపికకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రను సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, ఐవీ నారాయణ, తమ్మినేని వెంకటరెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, కొప్పరపు సత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

అలాగే, హనుమంతునిపాడు మండలం ముప్పళ్ళపాడు పీఏసీఎస్‌ చైర్మన్‌గా కుందురు నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈసందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్‌) తో కలిసి సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. పీఏసీఎస్‌ చైర్మన్‌గా నియమితులైన కుందుకు నారాయణరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో గాయం తిరుపతిరెడ్డి, వేశపోగు రాజేష్‌, మురహరి నరసయ్య, చీకటి వెంకటసుబ్బయ్య, రెడ్డెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

ట్రాక ్టర్‌ ర్యాలీని జయప్రదం చేయాలి

పామూరు : కనిగిరి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం జరిగే ట్రాక్టర్‌ ర్యాలీలో రైతులు విరివిరిగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పువ్వాడి అపార్ట్‌మెంట్‌లో టీడీపీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి రైతులు, కూటమి శ్రేణులు ట్రాక్టర్‌లతో కనిగిరికి తరలిరావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, సయ్యద్‌ అమీర్‌బాబు, మాజీ ఎంపీపీ పువ్వాడి తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని తూర్పుకట్టకిందపల్లి గ్రామంలో శ్రీఆభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉగ్ర పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 10:13 PM