మార్టూరు పంచాయతీ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:56 PM
జాతీయ రహదారి కలిగిన మార్టూరు పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నా రు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్స వం సందర్భంగా గురువారం మార్టూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వ్యయంతో పెద అండరుపాస్ వద్ద నిర్మించిన పబ్లిక్ టాయ్‌లెట్లను ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు.
పబ్లిక్ టాయ్‌లెట్లను ప్రారంభించిన
ఎమ్మెల్యే ఏలూరి
మార్టూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి కలిగిన మార్టూరు పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నా రు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్స వం సందర్భంగా గురువారం మార్టూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వ్యయంతో పెద అండరుపాస్ వద్ద నిర్మించిన పబ్లిక్ టాయ్‌లెట్లను ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు. అలాగే గ్రామ పంచాయతీ వారు కొనుగోలు చేసిన చెత్తను తరలించే 10 మినీ రిక్షాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రాజధాని అమ రా వతికి దగ్గరలో ఉన్న మార్టూరు పంచాయతీ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మార్టూ రు చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు నిధుల మంజూరు, ఎఫర్ట్ సంస్థ సహకారంతో గ్రామంలో మొక్కల ఏర్పాటుకు సహకారం అందిస్తామన్నారు. జాతీయ రహదారిని విస్తరించే క్రమంలోనే 2015లో మార్టూరు సెంటర్‌లో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నాగరాజుపల్లి రోడ్, కొణిదెనరోడ్ వద్ద మినీ అండర్ పాస్, రాజుపాలెం కూడలి వద్ద పెద అండరుపా్‌స, జొన్నతాళి రోడ్డు వద్ద మినీ అండరుపాస్ మంజూరుకు కృషి చేశానన్నారు. జలజీవన్ మిషన్ కింద ఇంటిం టికీ కొళాయి నీటిని అందిస్తామ న్నారు. అనంతరం మార్టూరు సెంటర్లో ఆర్వో ప్లాంట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించగా, సభావేదిక వద్ద ఉన్న శ్రీరాం రామయ్య గోవిందమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీరాం శేషగిరిరావు ఆర్‌వో ప్లాంటు ఏర్పాటుకు రూ.2లక్షల చెక్కును విరాళం గా ఎమ్మెల్యే ఏలూరికి అందచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వై శ్రీనివాసరా వు, ఆర్‌డడబ్ల్యూఎస్ డీఈ సతీష్, ఏఈ బ్రహ్మయ్య, సర్పంచ్ భూక్యా సుమితాబాయి, షేక్ రజాక్, కామినేని జనార్దన్, ఆదినారాయణ, గుర్రం శ్రీను,బండి నాగేశ్వరరావు, జంపని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.