కాటంరాజు క్షేత్ర అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:16 PM
జానపద వీరుడు శ్రీ వేణూతల కాటంరాజు క్షేత్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేణూతల కాటంరాజు, గంగాభవానీ దేవస్థాన ఆలయాన్ని ఎరిక్షన్‌బాబు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
పెద్దారవీడు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జానపద వీరుడు శ్రీ వేణూతల కాటంరాజు క్షేత్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేణూతల కాటంరాజు, గంగాభవానీ దేవస్థాన ఆలయాన్ని ఎరిక్షన్‌బాబు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి, బోరు నిర్మాణాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ పథకం కింద రూ.30 లక్షలతో నిర్మించ తలపెట్టిన 10 యూనిట్లకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ కాటంరాజు జమీందార్లు, పాలకుల అన్యాయాలకు ఎదురొడ్డిన పోరాడిన వీరుడు కాటంరాజన్నారు. పేదలకు సహాయం చేయడం, ధర్మాన్ని కాపాడాలన్న కాటంరాజు లక్ష్యాలను ప్రతి ఒక్కరూ పటించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మెట్లు శ్రీనివాసులరెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి గొట్టం శ్రీనివాసులరెడ్డి, రోడ్డు నిర్మాణ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీను, ఆలయ అభివృద్ధి కమిటీ సలహాదారులు పిన్నిక లక్ష్మీ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.