ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:10 AM
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, ఈక్రమంలోనే ఏరియా హాస్పిటల్లో త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యే కొండయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. చీరాల చుట్టు పక్కల నుంచి నిత్యం అధిక సంఖ్యలో ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన
ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, ఈక్రమంలోనే ఏరియా హాస్పిటల్లో త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యే కొండయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. చీరాల చుట్టు పక్కల నుంచి నిత్యం అధిక సంఖ్యలో ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అత్యవసర సేవలకు గుంటూరు, ఒంగోలు వెళుతున్న నేపథ్యంలో ఆ సేవలు కూడా సామాస్యులకు చీరాల్లోనే అందాలని మంత్రిని కోరడంతో సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న క్వశ్చన్ అవర్‌లో తీర ప్రాంత ప్రజల చిరకాల కోరిక రామాపురం ఫిషింగ్ హార్బర్ స్థితిగతులపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట ఆప్కో హ్యాండ్‌లూమ్ చైర్మన్ సజ్జా హేమలత, కౌన్సిలర్ మించాల సాంబశివరావు, మాజీ సర్పంచ్ జంగిలి రాముడు ఉన్నారు.