విద్యకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:08 PM
కనిగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధి చెందాలన్నదే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలోని మహాత్మా జ్యోతిభా పూలె రెసిడెన్షియల్ పాఠశాలలో మినరల్ ఆర్వో ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
కనిగిరి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): కనిగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధి చెందాలన్నదే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలోని మహాత్మా జ్యోతిభా పూలె రెసిడెన్షియల్ పాఠశాలలో మినరల్ ఆర్వో ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందన్నారు. తాను అఽధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్‌లు, పాఠశాలల్లో మంచినీటి వసతి కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాలు, వసతులను విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాంతి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గిరిజ, తదితరులు పాల్గొన్నారు.