రైతులకు ఈ-పంట.. కూలీలకు ఈకేవైసీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:18 AM
జిల్లావ్యాప్తంగా రైతులకు ఈ-పంట, ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రజల జీవనోపాధిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెండింటినీ చేపట్టింది. ఇవి అన్నదాతలకు అనేక ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు గ్రామీణ కూలీల ఆర్థిక స్వావలంబనకు అలంబనగా నిలవనున్నాయి.
నమోదులో నిమగ్నమైన అధికారులు
పంట నమోదులో పుల్లలచెరువు చివరిస్థానం
ఈనెల 25వరకు గడువు పొడిగింపు
ఈకేవైసీలో అట్టడుగున దొనకొండ
త్రిపురాంతకం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా రైతులకు ఈ-పంట, ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రజల జీవనోపాధిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రెండింటినీ చేపట్టింది. ఇవి అన్నదాతలకు అనేక ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు గ్రామీణ కూలీల ఆర్థిక స్వావలంబనకు అలంబనగా నిలవనున్నాయి. ఈ-పంట నమోదు వలన పంటల బీమా, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు, మద్దతు ధర వంటివి రైతులకు లభిస్తాయి. జాబ్‌కార్డులు కలిగిన వారికి ఈకేవైసీ వలన ఉపాధి హామీలో పారదర్శకత పెరగనుంది. జిల్లావ్యాప్తంగా పంట నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో ప్రభుత్వం ఈనెల 25 వరకు గడువు పొడిగించింది. దీంతో అధికారులు కూడా నూరుశాతం నమోదుకు కృషి చేస్తున్నారు. మరోవైపు ఈకేవైసీ ద్వారా ఉపాధి హామీ పనుల్లో బోగస్ మస్టర్లకు చెక్ పడనుంది. కూలీల వేతనాలు సకాలంలో బ్యాంకుల ద్వారా అందడంతోపాటు ఇతర సదుపాయాలు లభిస్తాయి. ఇందులో నమోదు కాని వారికి పని కల్పించటం కుదరదని చెప్పడంతో ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ-పంట నమోదులో పుల్లలచెరువు మండలం అట్టడుగున ఉంది. ఉపాధి హామీ కూలీలు ఎక్కువ మంది ఈ ప్రాంతంలోనే ఉన్నందున ఈ రెండు కార్యక్రమాలు 100 శాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు.