Share News

స్వశక్తితో ఆర్థిక పురోగతి చెందాలి

ABN , Publish Date - Sep 29 , 2025 | 10:40 PM

స్వశక్తితో మహిళలు ఆర్థిక పురోగతి చెందాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక స్ర్తీశక్తి భవనంలో సోమవారం ఎస్‌హెచ్‌జీ సంఘాలకు డీఆర్‌డీఏ పీడీ నారాయణతో కలసి రూ.6 కోట్ల 44లక్షల 50వేలు చెక్కులు ఆయన పంపిణీ చేశారు.

స్వశక్తితో ఆర్థిక పురోగతి చెందాలి
మండలసమాఖ్యకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నారాయణ తదితరులు

మహిళలకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సూచన

రూ6.44 కోట్ల చెక్కుల పంపిణీ

కనిగిరి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్వశక్తితో మహిళలు ఆర్థిక పురోగతి చెందాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక స్ర్తీశక్తి భవనంలో సోమవారం ఎస్‌హెచ్‌జీ సంఘాలకు డీఆర్‌డీఏ పీడీ నారాయణతో కలసి రూ.6 కోట్ల 44లక్షల 50వేలు చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ గ్రామాల్లో కూడా మహిళలు చిరువ్యాపారాలు చేసుకుని వృద్ధి చెం దాలన్నారు. అందుకోసం తక్కువ వడ్డీతో రుణాలు అం దిస్తున్నట్టు చెప్పారు. ఈరుణాలతో గ్రామాల్లోనే చిన్న కుటీరపరిశ్రమలు, వస్తువుల తయారీ, నిత్యావసర, కూరగాయల దుకాణాలు, ఫ్యాన్సీ అంగళ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళా కుటుంబాలు వ్యవసాయ పొలాల అభివృద్ధి, పంటల సాగు, కూరగాయల సాగు, పశుపోషణ వంటివి నిర్వ హించుకుంటూ వాటి ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ నారాయణ మాట్లాడుతూ బ్యాంకుల లింకేజీ రుణాలు, స్రీనిధి, సీఐఎఫ్‌, ఉన్నతి, ఎఫ్‌పీ ద్వారా రుణాలను పొంది సకాలంలో చెల్లించాలన్నారు. తద్వార తక్కువ వడ్డీతో మంచి లాభాలను పొందవచ్చునని చెప్పారు. డీఆర్‌డీఏ ఏపీఎంలు, సీసీల సూచనలు పాటించా లన్నారు. రుణాల చెల్లింపులో నూ ఎస్‌హెచ్‌జీ మహిళలు సహకరించాలన్నారు.

కార్యక్రమంలో డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ దంతు లూరి ప్రకాశం, నాయకులు పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, యా రవ శ్రీను, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు , మండల సమాఖ్య అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఏపీఎం అశోక్‌, సీసీలు బాషా, జిలాని, రమణయ్య, సుబ్రమణ్యం, వజ్రమ్మ, ఎస్‌హెచ్‌జీ మహి ళలు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 10:40 PM