రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
ABN , Publish Date - Sep 21 , 2025 | 02:39 AM
ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలలు తిరిగి అక్టోబరు 3న పునఃప్రారంభం కానున్నాయి.
వచ్చేనెల 3న పునఃప్రారంభం
ఒంగోలు విద్య, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలలు తిరిగి అక్టోబరు 3న పునఃప్రారంభం కానున్నాయి. ఎన్సీఈఆర్టీ ప్రకటించిన 2025-26 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు ఈనెల 24 నుంచి అక్టోబరు 2 వరకు సెలవులు ప్రకటిం చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. గతంలో మన రాష్ట్రంలోనూ దసరా పండుగకు 11 రోజులు సెలవులు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. దీనికి తోడు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయ కులు కూడా ఈనెల 22నుంచి పాఠశాలలకు సెల వులు ప్రకటించాలని కోరారు. వీరి విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దసరా సెలవుల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలకు మాత్రం ఈనెల 27 నుంచి అక్టోబరు 2 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ పాఠశాలలకు తాజా మార్పులతో సెలవులు 9 నుంచి 11 రోజులకు పెరిగినట్లు అయింది.