ఆటోవాలాలకు దసరా ధమాకా
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:13 AM
ఆటోవాలాలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించింది. సొంత ఆటో కలిగి ఉన్న డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు అందించనున్నట్లు బుధవారం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.
జిల్లాలో 11,200 మంది డ్రైవర్లకు లబ్ధి
విధివిధానాల కోసం ఎదురుచూస్తున్న రవాణా శాఖ
ఒంగోలుక్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఆటోవాలాలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించింది. సొంత ఆటో కలిగి ఉన్న డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు అందించనున్నట్లు బుధవారం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.90లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జిల్లాలో సుమారు 11,200 మంది డ్రైవర్లకు ఏడాదికి రూ.16.80కోట్లు అందజేయనున్నారు. గత లెక్కల ప్రకారం జిల్లాలో వాహనమిత్ర పఽథకం ద్వారా 10,741 మంది లబ్ధిదారులుండగా ప్రస్తుతం మరో 5శాతం పెరిగే అవకాశం ఉంది. ఆప్రకారం సుమారు 11,200 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది ఇంకా ప్రభుత్వం నుంచి విఽధివిధానాలు విడుదల కాలేదు. అయితే గతంలో ఇచ్చిన లబ్ధిదారుల జాబితాలతో రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న జాబితాలో ఇప్పటివరకు ఎవరు అర్హులు అనే కోణంలో పరిశీలన చేస్తున్నారు.