Share News

ఘనంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:54 PM

చీరాల - పేరాల ఉద్యమ కారులు, మహనీయులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని పలువురు వక్తలు అన్నారు.

 ఘనంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి

చీరాల, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి) : చీరాల - పేరాల ఉద్యమ కారులు, మహనీయులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని పలువురు వక్తలు అన్నారు. సోమవారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్ర హానికి పూలమాలలు వేసి నివళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లా డుతూ గోపాలకృష్ణయ్య ఆశయాలను ముందు కు తీసుకుపోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ కౌతవరపు జనార్ధనరావు, సర్విశెట్టి సుబ్బరామయ్య, అర్వపల్లి కుమార్‌, వేణుగోపాల్‌, కోట వెంకటేశ్వరరెడ్డి, సురేష్‌, శివప్రసాదరావు, రమేష్‌, గజవల్లి శ్రీనివాసరావు, నాగవీరభద్రా చారి, బీరం సుందరరావు, రాధాకృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..

ఆంధ్రరత్న, ప్రముఖకవి, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య జయంతి వేడుకలు వాకర్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చీరాల ప్రాంతంతో దుగ్గిరాలకు ఉన్న సంబంధాలను వివరించారు. కార్యక్రమంలో ప్రతినిధులు పోలుదాసు రామకృష్ణ, గురుప్రసాద్‌, నారాయణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, ప్రసాద్‌, వీరాంజనేయులు, సుబ్బారావు, పూర్ణ, బాలకృష్ణ, వెంకటేశ్వరరావు, తదితర సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:54 PM