ఒంగోలు చేరిన డీఎస్సీ అభ్యర్థులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:31 AM
మెగా డీఎస్సీ టీచర్ పోస్టులకు ఎంపికై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్న అభ్యర్థులు బుధ వారం సాయంత్రానికి ఒంగోలులో వారికి కేటాయిం చిన వసతి కేంద్రాలకు చేరుకున్నారు.
వసతి కల్పించిన కేంద్రాల్లో బస
నేడు ప్రత్యేక బస్సుల్లో అమరావతికి..
సీఎం చంద్రబాబు నుంచి అందుకోనున్న నియామక పత్రాలు
ఒంగోలు విద్య, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ టీచర్ పోస్టులకు ఎంపికై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్న అభ్యర్థులు బుధ వారం సాయంత్రానికి ఒంగోలులో వారికి కేటాయిం చిన వసతి కేంద్రాలకు చేరుకున్నారు. డీఎస్సీలో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ, టీజీటీ, ప్రిన్సి పాల్ పోస్టులకు 849మంది ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 372, మహిళలు 477 మంది ఉన్నారు. పురుష అభ్యర్థులకు క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో, మహిళా అభ్యర్థులకు సెయింట్ జేవియర్స్ హైస్కూలు, అగ్జీలియం ఇంగ్లీషు మీడియం స్కూలు, మంగమూరు రోడ్డులోని రామచంద్రమిషన్ ఆశ్ర మంలో రాత్రికి బస ఏర్పాటు చేశారు. వీరిని గురు వారం ఉదయం అల్పాహారం అనంతరం 43 బస్సు ల్లో అమరావతిలో జరిగే సీఎం సభకు తరలిస్తారు. వీరికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులకు గుర్తింపు కార్డులను జారీచేశారు. అభ్యర్థులతో రిజిస్ట్రేషన్ ఫారాలు పూర్తిచేయించారు. గురువారం అమరావతి వెళ్లేందుకు ఎంతమంది అభ్యర్థులు తమ తల్లిదండ్రులతో వచ్చారో వివరాలు తెలుసుకు నేందుకు డీఈవో కిరణ్‌కుమార్‌ను పలుమార్లు ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. దీంతో ఎంతమంది ఒంగోలు వచ్చింది కచ్చితమైన సంఖ్య తెలియలేదు.