Share News

దర్శిలో నిలిచిన తాగునీటి సరఫరా

ABN , Publish Date - May 06 , 2025 | 11:00 PM

ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం ప్రధాన పైపులైన్లు పగిలిపోవటంతో ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దర్శి పట్టణంలోని అనేక ప్రాంతాలకు ఎన్‌ఏపీ నీరు అందటం లేదు. దీంతో ఇతర ప్రాంతాల ప్రజలు దర్శి పట్టణంలోని తూర్పుచౌటపాలెం రోడ్డులోని ఒవర్‌హెడ్‌ ట్యాంకు వద్దకు వచ్చి ట్యాపు వద్ద మంచినీళ్లు పట్టుకొని వెళ్తున్నారు.

దర్శిలో నిలిచిన తాగునీటి సరఫరా
దర్శి పట్టణంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు ట్యాపు వద్ద నీటిని పట్టుకుంటున్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు

పైప్‌లైన్లు పగలడంతో అంతరాయం

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

దర్శి, మే 6(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం ప్రధాన పైపులైన్లు పగిలిపోవటంతో ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దర్శి పట్టణంలోని అనేక ప్రాంతాలకు ఎన్‌ఏపీ నీరు అందటం లేదు. దీంతో ఇతర ప్రాంతాల ప్రజలు దర్శి పట్టణంలోని తూర్పుచౌటపాలెం రోడ్డులోని ఒవర్‌హెడ్‌ ట్యాంకు వద్దకు వచ్చి ట్యాపు వద్ద మంచినీళ్లు పట్టుకొని వెళ్తున్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైను సామర్థ్యం కోల్పోయి పగిలిపోతున్నాయి. కురిచేడు రోడ్డులో పది అడుగుల లోతులో ఉన్న పగిలిన పైపులైన్‌ గుర్తించి ఎట్టకేలకు మరమ్మతులు చేశారు. దర్శి-పొదిలి రోడ్డులో పగిలిన పైపులైన్‌కు మరమ్మతులు చేశారు. ఒకచోట మరమ్మతులు చేసేలోపు మరోచోట పగులుతుండటంతో సిబ్బంది పగిలిన పైపులైన్‌ ప్రదేశాన్ని కనుగొనేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. పైపులైన్‌ పగిలిన ప్రతిసారి రోజులు తరబడి మంచినీటి సరఫరా నిలిచిపోవటంతో దర్శి పట్టణంతో పాటు అనేక గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ వేసవిలో మంచినీరు అందుబాటులో లేకపోతే ప్రజలు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అధికారులు తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 06 , 2025 | 11:00 PM