తాగునీటి సమస్య లేకుండా చూడాలి
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:47 PM
నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అధికారులు చూడాలని, గ్రామాలలో కూడా పర్యటించి పరిస్థితులను తెలుసుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు.
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అధికారులు చూడాలని, గ్రామాలలో కూడా పర్యటించి పరిస్థితులను తెలుసుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన నివాసంలో నియోజకవర్గంలోని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా మంజూరైన కొన్ని పనులు రద్దయ్యాయని, అవి తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో మరుగు దొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రజలకు సమర్ధవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అశోక్‌రెడ్డి తెలిపారు.