Share News

పెద్దయాచవరంలో తాగు నీటికి కటకట

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:01 PM

తాగు నీటి కోసం మండలంలోని పెద్ద యాచవరం గ్రామస్థులు కటకటలాడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి పోవడంతో గ్రామంలో ఉన్న బోర్లు అధిక శాతం నీరు లేక ఒట్టి పోయాయి. దీంతో గ్రామంలో నీటికష్టాలు మొదలయ్యాయి. నీటి కోసం గ్రామ శివారులో ఉన్న సింగిల్‌ పేస్‌ మోటార్‌ ద్వారా అరకొరగా వచ్చే నీటి కోసం వేచి ఉండి నీటిని బైకులపై, తోపుడు బండ్లపై, నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు.

పెద్దయాచవరంలో తాగు నీటికి కటకట
ఊరి బయట ఉన్న బోరు వద్ద బిందెలతో నీటిని పట్టుకుంటున్న గ్రామస్థులు

బైకులపై నీటిని తెచ్చుకుంటున్న స్థానికులు

ట్యాంకర్‌ల ద్వారా సరఫరా చేయాలని వినతి

మార్కాపురం రూరల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : తాగు నీటి కోసం మండలంలోని పెద్ద యాచవరం గ్రామస్థులు కటకటలాడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి పోవడంతో గ్రామంలో ఉన్న బోర్లు అధిక శాతం నీరు లేక ఒట్టి పోయాయి. దీంతో గ్రామంలో నీటికష్టాలు మొదలయ్యాయి. నీటి కోసం గ్రామ శివారులో ఉన్న సింగిల్‌ పేస్‌ మోటార్‌ ద్వారా అరకొరగా వచ్చే నీటి కోసం వేచి ఉండి నీటిని బైకులపై, తోపుడు బండ్లపై, నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు. వీధులలో ఉన్న ఇళ్ళ మధ్య ఉన్న కొళాయిలకు నీరు రాకపోతుండడంతో గ్రామ శివారులో ఉన్న బోరులో నీరు తెచ్చుకునేందుకు ఇంట్లో వారు పనులు మానుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. గ్రామానికి సాగర్‌ నీటి సరఫరా సౌకర్యం ఉన్నప్పటికీ నీరు సక్రమంగా సరఫరా కావడంలేదని తెలిపారు. పదిరోజులకు ఒకసారి కూడా సాగర్‌ నీటి సరఫరా చేయకపోవడంతో నీటి కోసం కష్టాలు తప్పడంలేదని వాపోయారు. అసలే వేసవి కాలం కావడంతో పశువులకు కూడా పొలాల్లో నీరు దొరకక పోవడంతో నీరు అధికంగా ఖర్చవుతున్నాయని తెలిపారు. గ్రామంలో కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీటి సరఫరా చేయక పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబందిత అధికారు లు, ప్రజా ప్రతినిధులు నీటి స మస్యను గు ర్తించి పరిస్కరించాలని గ్రా మస్థులు కోరుతున్నారు.

ట్యాంకర్‌లతో సరఫరా చేయాలి

గ్రామంలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నాం. ట్యాంకర్‌ల ద్వారా నీటిని సరఫరా చేసి సమస్యను తీర్చాలి. ప్రతి రోజు బైకులపై సుమారు గంట పాటు ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకుపోవాల్సి వస్తోంది. నీటి కోసం ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంట్లో పెద్ద వారు ఉన్నా సుమారు అర కిలోమీటర్‌ దూరం ఉండడంతో నీరు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

- పెద్ద భాజీ యువకుడు, స్థానికుడు

రోజూ 40 బిందెలను మోటార్‌ సైకిల్‌పై తెస్తున్నా

గ్రామ శివారులో ఉన్న బోరు వద్ద ఇంటికి సుమారు అర కిలోమీటర్‌ దూరం నుంచి ప్రతి రోజు 45 బిందెల నీటిని మోటార్‌ సైకిల్‌పై తెచ్చుకుంటున్నాను. బోర్లకు నీరు రాకపోవడంతో ఇంటి వద్ద ఉన్న కొళాయిలకు నీరు రావడంలేదు. రోజూ నీటి కోసం సుమారు రెండు గంటల సమయం కెటాయించాల్సి వస్తుంది. సింగిల్‌ పేస్‌ మోటార్‌ కావడంతో నీరు అరకొరగా మాత్రమే వస్తుంది. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తినపుడు నీటికి తీవ్ర సమస్య ఏర్పడుతుంది. కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా తాగునీరు సరఫరా చేసి నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నాం.

- డీ చిన ్నకాశిం, స్థానికుడు

Updated Date - Apr 27 , 2025 | 11:01 PM