Share News

తాగునీరు, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:31 PM

తొలి ఏడాదిలో ఎమ్మెల్యేల పనితీరును ఆయా నియోజకవర్గాల్లో జరిగిన, జరగాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కనిగిరిపై సోమవారం రాత్రి అమరావతిలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి నియోజకవర్గ పరిస్థితులను చెప్పారు.

తాగునీరు, రోడ్ల అభివృద్ధికి  ప్రాధాన్యత ఇస్తా

బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో జాప్యంపై ఉగ్ర ఫిర్యాదు

రెండు సామాజికవర్గాల ప్రజలను మరింత ఆకట్టుకోవాలి

మీ పరిస్థితి బాగుంది.. పార్టీ కమిటీలను ఇంకా పటిష్టం చేయండి

కనిగిరి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష
కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రకు సీఎం హామీ

ఒంగోలు, ఆంధ్రజ్యోతి

తొలి ఏడాదిలో ఎమ్మెల్యేల పనితీరును ఆయా నియోజకవర్గాల్లో జరిగిన, జరగాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కనిగిరిపై సోమవారం రాత్రి అమరావతిలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి నియోజకవర్గ పరిస్థితులను చెప్పారు. అందిన సమాచారం మేరకు.. నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు సమస్య విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తాగునీటి పథకం ప్రతిపాదనను ఎమ్మెల్యే ఉగ్ర సీఎంకు వివరించారు. వాటిని అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్న విషయం ప్రస్తావించగా, రిలయన్స్‌ సంస్థ చేపట్టిన బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు వేగంగా జరగడంలేదని డాక్టర్‌ ఉగ్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అలాంటివి మరికొన్ని ప్రాజెక్ట్‌లు ఇవ్వాలని ఉగ్ర కోరారు. బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణం వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ట్రిపుల్‌ ఐటీ, వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తదనంతరం తన వద్ద నివేదిక ఆధారంగా రాజకీయ అంశాలను కూడా సీఎం సమీక్ష చేశారు. ‘నియోజకవర్గంలో మీరు అందుబాటులో ఉంటున్నారు.. మధ్యలో మీరు కొన్ని రోజులు లేరన్న’ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మహానాడు నిర్వహణకు కడప, యోగాంధ్ర కార్యక్రమ పనులపై విశాఖ వెళ్లినందున ఆ కొద్ది రోజులు నియోజకవర్గంలో లేనని ఉగ్ర వివరించారు. రెండు సామాజికవర్గాల ప్రజలను రాజకీయంగా మరింత చేరువచేసుకోవాల్సిన అవసరాన్ని సీఎం ఉగ్రకు తెలిపారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నేతలు మందా కృష్ణమాదిగను కూడా నియోజకవర్గానికి ఆహ్వానించి కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. మరో సామాజిక వర్గ ఓటర్లలో రాజకీయంగా నిలకడ కనపడలేదని, అందుకు కారణాలను గుర్తించి వారిలో పలుకుబడిని పెంచుకునేందుకు కృషి చేయాలని ఉగ్రకు సూచించినట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ ప్రజా సంబంధాలు కొనసాగింపులో ఉగ్ర పనితీరును కొనియాడిన ఆయన పార్టీ అనుబంధ సంస్థల నియామకాలను పూర్తి చేయకపోవడంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఒక మండలంలో నాయకులు, కార్యకకర్తల మఽధ్య గ్యాప్‌ పెరిగిందని, వెంటనే సరిచేయాలని తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆదేశించినట్లు తెలిసింది.

Updated Date - Jul 07 , 2025 | 11:31 PM