Share News

7న డీఆర్సీ సమావేశం

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:33 AM

DRC meeting on the 7th జిల్లాస్థాయిలో అత్యంత కీలకమైన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశం ఈనెల 7వతేదీన నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో ఇన్‌చార్జి మంత్రి ఆనం రామానారాయణరెడ్డి అధ్యక్షతన జరగనుంది.

7న డీఆర్సీ సమావేశం

మొంథా తుఫాన్‌ నష్టాలు, ఇతర అంశాలపై చర్చ

ఒంగోలు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయిలో అత్యంత కీలకమైన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశం ఈనెల 7వతేదీన నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో ఇన్‌చార్జి మంత్రి ఆనం రామానారాయణరెడ్డి అధ్యక్షతన జరగనుంది. తొలుత గతనెల 24న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే వర్షాలు పడుతుండటం, భారీగా శుభకార్యాలు ఉండటంతో సమావేశానికి హాజరుకావాల్సిన కీలక ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశాలు అంతగా లేకపోవడంతో వాయిదా వేశారు. తిరిగి గత నెలాఖరులోనే నిర్వహించాలని భావించినా మొంథా తుఫాన్‌ వల్ల వీలు కాలేదు. దీంతో డీఆర్సీ సమావేశాన్ని ఈనెల 7న ఏర్పాటు చేశారు. తుఫాన్‌ ప్రబావంతో వాటిల్లిన నష్టాలతో పాటు, పలు ఇతర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:33 AM