Share News

24న డీఆర్సీ సమావేశం

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:39 AM

జిల్లా సమీక్షా మండలి సమా వేశం (డీఆర్సీ) ఈనెల 24న జరగనుంది. ఆరోజు ఉదయం 10.30 గంట లకు ఒంగోలు ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమ వుతుంది.

24న డీఆర్సీ సమావేశం

ఇన్‌చార్జి మంత్రి ఆనం అధ్యక్షతన నిర్వహణ

ఒంగోలు, అక్టోబరు 18 (ఆంరఽధజ్యోతి) : జిల్లా సమీక్షా మండలి సమా వేశం (డీఆర్సీ) ఈనెల 24న జరగనుంది. ఆరోజు ఉదయం 10.30 గంట లకు ఒంగోలు ప్రకాశం భవన్‌లోని సమావేశపు హాలులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమ వుతుంది. జిల్లాస్థాయిలో అత్యంత కీలకమైన డీఆర్సీని ప్రతి మూడు నెల లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక గత ఏడాది అక్టోబరులో ఆనం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియామకం జరగ్గా తొలి సమావేశం ఆ ఏడాది నవంబరు 4న జరిగింది. రెండోసమావేశాన్ని ఈ ఏడాది మే 23న ఏర్పాటుకు నిర్ణయించగా ముందు రోజు రాత్రి ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య హత్యకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలకు 23న సీఎం చంద్రబాబు హాజరు నేపథ్యంలో వాయిదా పడింది. అనంతరం జూన్‌ 12న సమావేశాన్ని నిర్వహించారు. కొత్త కలెక్టర్ల నియామకాలు గత నెలలో జరగ్గా అనంతరం అన్ని జిల్లాల్లోనూ డీఆర్సీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 24న ఇక్కడ ఏర్పాటుకు నిర్ణయించారు.

Updated Date - Oct 19 , 2025 | 01:39 AM