12 న డీఆర్సీ సమావేశం
ABN , Publish Date - May 07 , 2025 | 12:27 AM
అత్యంత కీలకమైన జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశం ఈ నెల 12న జరగనుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు ప్రకాశం భవనంలోని పీజీఆర్‌ఎస్ హాలులో దీన్ని నిర్వహించనున్నారు. వాస్తవానికి గతనెల 23న డీఆర్సీ జరగాల్సి ఉంది.
కీలక అంశాలతో అజెండా
ఒంగోలు, మే 6 (ఆంధ్రజ్యోతి) : అత్యంత కీలకమైన జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశం ఈ నెల 12న జరగనుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు ప్రకాశం భవనంలోని పీజీఆర్‌ఎస్ హాలులో దీన్ని నిర్వహించనున్నారు. వాస్తవానికి గతనెల 23న డీఆర్సీ జరగాల్సి ఉంది. అయితే 22వతేదీ రాత్రి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి దారుణహత్యకు గురయ్యారు. ఆ మరుసటి రోజున అమ్మనబ్రోలులో ఆయన అంత్యక్రియలు జరగ్గా, నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చారు. దీంతో 23వతేదీ జరగాల్సిన డీఆర్సీ సమావేశాన్ని వాయిదా వేశారు. తాజాగా ఈనెల 12న నిర్వహించాలని ఇన్‌చార్జి మంత్రి నిర్ణయించారు. ఆ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చారు. కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల పురోగతి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారం, విద్యుత్ రంగంలో పీఎం సూర్యఘర్ పథకం తీరు, రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రఽధాన్యతగా భావిస్తున్నప్రజావినతుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించేలా అజెండాను రూపొందిస్తున్నట్లు తెలిసింది.