Share News

‘నామ్‌’కేవాస్తే డ్రైనేజీ

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:40 AM

అద్దంకి పట్టణంలో నామ్‌ రోడ్డు వెంబడి నిర్మించిన సైడ్‌డ్రైన్లు అస్థవ్యస్థంగా ఉన్నాయి.

‘నామ్‌’కేవాస్తే డ్రైనేజీ

అద్దంకి, సెప్టెంబరు11 (ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణంలో నామ్‌ రోడ్డు వెంబడి నిర్మించిన సైడ్‌డ్రైన్లు అస్థవ్యస్థంగా ఉన్నాయి. దీంతో మురుగు నీరు ప్రవహించే వీలు లేక దుర్వాసన వస్తోంది. నామ్‌ రోడ్డు నిర్మాణ స మయంలో వర్షపు నీరు ప్రవహించే విధంగా మాత్రమే సైడ్‌డ్రైన్లు నిర్మించారు. అయితే మున్సిపాలిటీ అధికారులు ఆయా ప్రాంతా లలో ప్రత్యేకంగా సైడ్‌డ్రైన్లు నిర్మించకుండా నామ్‌ రోడ్డు వెంబడి ఉన్న కాలువల్లోనికే ఆ యా ప్రాంతాల నుండి వచ్చే మురుగు నీరు కలిసే విధంగా చేశారు. అయితే నామ్‌ రోడ్డు వెంబడి ఉన్న సైడ్‌డ్రైన్‌లు అస్థవ్యస్థంగా ఉం డడంతో మురుగు నీరు ప్రవహించడం లేదు. దీంతో రోడ్డు పైకి చేరుతుంది. ప్రధానంగా భవానిసెంటర్‌లో పలుదుకాణాలు, హోటళ్ల నుంచి వచ్చే మురుగు ముందుకు ప్రవహిం చ కుండా నిలచిపోతోంది. దీంతో దుర్వాసన తట్టుకోలేక ఆ ప్రాంతంలోని పలువురు షాపుల యజమానులు నాలుగురోజులుగా మూసేశారు. అసలే విషజ్వరాలు విజృంభిస్తు న్న తరుణంలో మురుగు నిలిచి ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్ప టికైనా నామ్‌ రోడ్డు నిర్వహణ సంస్థ, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో వ్యవ హరించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 12 , 2025 | 01:40 AM