పెరిగిన పింఛన్‌తో రెండింతల ఆనందం
ABN , Publish Date - Dec 01 , 2025 | 10:12 PM
ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కసారిగా పెరిగిన పింఛన్‌తో పింఛన్‌దారుల్లో ఆనందాలు రెండింతలు అయ్యాయని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు.
వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు
ఎర్రగొండపాలెం రూరల్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కసారిగా పెరిగిన పింఛన్‌తో పింఛన్‌దారుల్లో ఆనందాలు రెండింతలు అయ్యాయని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. మండలంలోని గంగాపాలెంలో ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి పింఛన్‌దారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏడాదికి ఒకసారి రూ.250 పెంచుకుంటూ కాలం దాటిస్తే ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే వితంతు పింఛన్ వెయ్యి రూపాయలు, దివ్యాంగుల పింఛన్ రెండు వేలు, మంచానికే పరిమితమైన పింఛన్‌దారులకు ఐదువేలు పెంచి చరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారని అన్నారు. ఆనంతరం గ్రామంలో మినీ గోకులం షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాళ వెంగళరెడ్డి, ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, పేరం రమణా రెడ్డి, వేగినాటి శ్రీను, ఎంసీహెచ్ మంత్రునాయక్, షేక్ మస్తాన్‌వలి (మ్యాక్స్), పంచాయతీ కార్యదర్శి కేశనపల్లి శివలింగమ్మ, చలమయ్య, ఆనంద్, మాగులూరి వెంకటేశ్వర్లు, బక్కయ్య, పడిదపు వెంకటరావు, గాజుల వెంకటనారాయణ, రామా నాయుడు, కొమ్ము గాలయ్య పాల్గొన్నారు.