యూరియాపై ఆందోళన వద్దు
ABN , Publish Date - Sep 10 , 2025 | 10:12 PM
ఎక్కడా యూరియా ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెంద వద్దని మండల స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.శివరామిరెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో యూరియా ఔట్‌రిచ్, నల్లపొగాకు సాగు నిషేధంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అందుబాటులో ఎరువులు
రైతులు, డీలర్ల అవగాహన కార్యక్రమంలో అధికారులు
గిద్దలూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఎక్కడా యూరియా ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెంద వద్దని మండల స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.శివరామిరెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో యూరియా ఔట్‌రిచ్, నల్లపొగాకు సాగు నిషేధంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎరువులు సకాలంలో రైతు సేవా కేంద్రాల నుంచి, ప్రైవేటు దుకాణాల నుంచి రైతులకు అవసరమైన మేర అందజేస్తామని అన్నారు. తహసీల్దార్ ఎం.ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ విచ్ఛలవిడిగా రసాయనిక ఎరువుల వాడకం వలన భూసారం దెబ్బతింటుం దన్నారు. కార్యక్రమంలో విజయభాస్కర్‌రెడ్డి, విస్తరణాధికారులు, గ్రామ సహాయకులు పాల్గొన్నారు.
రాచర్ల : యూరియా సమృద్ధిగా అం దుబాటులో ఉందని ఆందోళన అవసరం లేదని ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో యూరియా అవుట్ రీచ్ నల్లబర్లీ పొగాకుపై వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి డీలర్లు, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్లు, ఎంఈవో షేక్ మొయినుద్దీన్, ఎస్సై పీ కోటేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బీ జ్యోతి, పశువైద్యాధికారి హరిబాబు పాల్గొన్నారు.
త్రిపురాంతకం : యూరియాపై రైతులు అపోహ లు. ఆందోళన చెందవద్దని డ్వామా పీడీ జోస్‌ఫకుమార్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల ప్రత్యేకాధికారిగా ఇక్కడి పరిస్థితిపై సమీక్షించానని యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఇప్పటికే మండలానికి 250 ట న్నుల యూరియా సరఫరా అయిందన్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్‌కుమార్, తహసీల్దార్ కృష్ణమోహన్, ఏపీవో సుజాత, వ్యవసాయాధికారి సంగమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : అధికారుల సిఫారసుల మేరకే యూరియా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస ప్రసాధ్ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాసర్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దారు అశోక్‌కుమార్, ఎంఈవో మస్తాన్, హౌసింగ్ డీఈఈ సురే్‌షబాబు, ఏఈ శివశంకర్, గ్రామ కార్యదర్శులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.
పొదిలి : యూరియా గురించి రైతులు ఆందోళన చెందవద్దని మండల ప్రత్యేక అధికారి అర్జున్‌నాయక్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో యూరియా వాడకంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎక్కడ యూరియా కృత్రిమ కొరత సృష్టించవద్దని ఎరువుల దుకాణదారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుత్తా శోభన్‌బాబు, ఏవో డీ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇమాంసాహెబ్, మాదిరెడ్డిపాలెం సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్ యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రామాపురం కొండలు, గోగినేని వెంకట్రావ్, రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం వన్‌టౌన్ : మార్కాపురం డివిజన్ పరిధిలో రైతులకు కావాల్సిన యూరియాకు కొరత లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీ కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ బాలాజీ నాయక్, ఏవో బుజ్జి బాయిలతో కృష్ణారావు మాట్లాడారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : యూరియా కొరత లేదని మం డల స్పెషల్ ఆఫీసర్ ఎం.విష్ణువర్ధన్‌రావు అన్నారు. ఎర్రగొండపాలెం లో బుధవారం యూరియా ఔట్‌రిచ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏ ఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, తహసీల్దార్ మం జునాథరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో నీరజ, వెంగళరెడ్డి, వెంకటసుబ్బయ్య, అంజయ్య, మహేష్, రైతు సేవా కేం టద్రాల వీఏఏలు పాల్గొన్నారు.
కొనకనమిట్ల : రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించుకొని నానోయూరియా, నానో డీఏపీలను వాడాలని చెప్పారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన యూరియా ఔట్‌రిచ్ కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అరుణ, ఏపీవో బులెన్‌రావు, ఈవోఆర్డీ శ్రీదేవి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
తర్లుపాడు : రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని వ్యవసాయ అధికారి జోత్స్నదేవి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ఫెర్టిలైజర్స్ డీలర్లు, రైతులతో బుఽధవారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేకే కిశోర్ కుమార్, ఎంపీడీవో బుర్రి చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ సహాయకులు, డీలర్లు పాల్గొన్నారు.