Share News

బాలికల బాగోగులపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Aug 18 , 2025 | 10:51 PM

బాలికల బాగోగుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా మలేరియా అధికారి ఎన్‌.మధుసూదన్‌రావు, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్‌ డీ జయ అన్నారు. స్థానిక మండల అధికారులతో కలిసి వారు సోమవారం రాచర్ల గురుకుల పాఠశాలను సందర్శించారు.

బాలికల బాగోగులపై నిర్లక్ష్యం వద్దు
సిబ్బందికి సూచనలు ఇస్తున్న జిల్లా అధికారులు

డీఎంవో మధుసూదన్‌రావు

రాచర్ల, ఆగస్టు 18 (రాచర్ల) : బాలికల బాగోగుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా మలేరియా అధికారి ఎన్‌.మధుసూదన్‌రావు, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్‌ డీ జయ అన్నారు. స్థానిక మండల అధికారులతో కలిసి వారు సోమవారం రాచర్ల గురుకుల పాఠశాలను సందర్శించారు. గురుకులంలో 10వ తరగతి చదువుతున్న కె కరుణ అనారోగ్యానికి ఈనెల 16వ తేదీన కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న వారు పాఠశాలను సందర్శించి పాఠశాలలోని ఆర్వో ప్లాంట్‌, తరగతి గదులు, కిచెన్‌ రూం, లెట్రిన్‌, బాత్‌రూములు, పాఠశాల ఆవరణ, అన్నింటినీ పరిశీలించారు. ముఖ్యంగా పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. బాలికలకు చిన్న వ్యాధి ఉన్నట్లు గుర్తించినా వెంటనే వైద్యం చేయించాలని, వైద్య సిబ్బంది పాఠశాలల్లో క్యాంపు నిర్వహించి అవసరమైన మందులు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌.వెంకటరామిరెడ్డి, ఎంఈవోలు షేక్‌ మొయినుద్దీన్‌, వీ గిరిధర్‌ శర్మ, వైద్యాధికారులు ఎస్‌.భానుకుమార్‌రెడ్డి, కే రమేష్‌, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్‌ మేరీ మంజుల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 10:51 PM