Share News

అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:47 PM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.

అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
దెబ్బతిన్న మొక్క జొన్న పైరును పరిశీలిస్తున్న దర్శి టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

ముండ్లమూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం ముండ్లమూరులో దెబ్బతిన్న మొక్క జొన్న, మిరప తోటలను పరిశీలించారు. నష్టపో యిన రైతుల వివరాలను నమోదుచేయాలని తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఏవో తిరుమల రావును ఆదేశించారు. ఏరైతు కూడా ప్రభు త్వం అందించే పరిహారం అందలేదనే మాట రాకూడదన్నారు. ముండ్లమూరు మండలంలో ఏడువేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశార న్నారు. 1250 ఎకరాల్లో నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందించార న్నారు. లోతట్టు ప్రాంతాలైన మారెళ్ళ, ముండ్లమూరు, ఉల్లగల్లు గ్రామాల్లో నివశిస్తున్న వారిని స్థానిక ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. వారికి ప్రభుత్వం అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు.

ముండ్లమూరు నుంచి తమ్మలూరు వెళ్ళే చిలకలేరు వాగుపై దెబ్బతిన్న బ్రిడ్జిని డాక్టర్‌ లక్ష్మి పరిశీలించారు. వర్షపు నీరు తగ్గిన వెంటనే బ్రిడ్జి మరమ్మతులకు ప్రతిపాదనలు తయారుచేయాలని పంచాయతీరాజ్‌ అధికారులకు సూచించారు. వెంటనే నిధులు మం జూరు చేయిస్తానన్నారు. ఉమామహేశ్వర అగ్రహారం నుంచి చింతలపూడి వెళ్ళే ఆర్‌అండ్‌బీ రోడ్డు భారీ వ ర్షానికి కోసుకుపోగా, సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా చూడాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియో జకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌, దర్శి మునిసిపల్‌ చైర్మన్‌ నారపశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, సర్పంచ్‌ మేదర మెట్ల నారాయణమ్మ, తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 10:47 PM