నల్లబర్లీ పొగాకు సాగువద్దు
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:32 PM
నల్ల బర్లీ పొగాకు సాగుపై నిషేధం ఉన్నందున రబీ సీజన్‌లో పొగాకు సాగుచేసే రైతులు నల్లబర్లీ పొగాకు సాగుచేయవద్దని మండల వ్యవసాయ అధికారి ఎన్.రంగాకృష్ణ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని లక్ష్మక్కపల్లి, పిల్లివారిపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన అక్కడ రైతులు సాగుచేసిన వరి, కంది పైర్లను పరిశీలించారు.
పీసీపల్లి,నవంబరు12(ఆంధజ్ర్యోతి):నల్ల బర్లీ పొగాకు సాగుపై నిషేధం ఉన్నందున రబీ సీజన్‌లో పొగాకు సాగుచేసే రైతులు నల్లబర్లీ పొగాకు సాగుచేయవద్దని మండల వ్యవసాయ అధికారి ఎన్.రంగాకృష్ణ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని లక్ష్మక్కపల్లి, పిల్లివారిపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన అక్కడ రైతులు సాగుచేసిన వరి, కంది పైర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ రైతులతో ఆయన మాట్లాడుతూ వరిపైరులో ఆకుచుట్టు పురుగు కనిపిస్తున్నదని దాని నివారణకు లీటరు నీటిలో 2 ఎంఎల్‌ల క్లోరోపైరిపాస్ మందును కలిపి పిచికారీ చేయాలన్నారు.అలాగే వరిపొలంలో దోమపోటును తగ్గించేందుకు ప్రతి 2మీటర్ల దూరానికి 20సెంమీల వెడల్పుతో కాలిబాటను తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.రైతులకు కావాల్సిన ఎరువులు రైతుసేవాకేంద్రాలలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కావాల్సిన రైతులు ఆర్‌ఎ్‌సకెలలో వీఏఏలను సంప్రదించి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో షబానా, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.
రైతులు ఈ పంట నమోదు చేసుకోవాలి
ముండ్లమూరు : మండలంలోని పంటలు సాగు చేసిన రైతులందరూ ఈ పంట ద్వారా పంట నమోదు చేయించు కోవాలని మండల వ్యవసాయ అధికారి ఏ తిరుమలరావు అన్నారు. బుధవారం మండలంలోని ఈదర, పూరిమెట్ల గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన వరి పంటను సిబ్బందితో కలసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నల్లబర్లీ పొగాకు సాగును పూర్తిగా నిషేధించారని, ఆ పొగాకు సాగు చేసిన రైతులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెల్లబరీ సాగు చేసే రైతులు తప్పనిసరిగా కంపెనీ ప్రతినిధుల వద్ద ఎంవోయూ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వీఏఏలు తిప్పస్వామి, అంజలి, వాలేశ్వరరావు, దద్దాల మూర్తయ్య తదితరులు పాల్గొన్నారు.